నైపుణ్య శిక్షణతో యువత స్వయం సంవృద్ధి సాధించాలి

UPDATED 8th NOVEMBER 2017 WEDNESDAY 7:30 PM

పెద్దాపురం: కౌశల్ గోదావరి పథకంలో భాగంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం సంవృద్ధి సాధించేందుకు అపార అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు బుధవారం తెలిపారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో కౌశల్ గోదావరి పథకంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ రుణాలను సక్రమంగా వినియోగించుకుని యువత స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెట్టిందని, యువత వారు ఎంచుకున్న రంగంలో శిక్షణ ఇచ్చి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువత ప్రతీ ఒక్కరూ నైపుణ్య శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అభ్యర్థులకు కౌశల్ గోదావరి పథకం రిజిస్ట్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎంపిడివో వసంత మాధవి, ఎంపిటిసి గుత్తుల సూర్యావతి శ్రీనివాస్, కట్టమూరు సర్పంచ్ దిమ్మల పుష్పరత్నం తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us