రెడ్ బీ న్యూస్, 16 జనవరి 2022: అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్, జీస్టూడియోస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంది. పెద్ద సినిమాలన్నీ కోవిడ్ కారణంగా సంక్రాంతి రేస్ లోంచి తప్పుకోగా.. సోలోగా బరిలోకి దిగిన బంగార్రాజు మూవీ మొదటి రోజు రూ. 17.5 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. నాగ్ అండ్ చైతూ మాస్ పెర్ఫార్మెన్స్, కృతి శెట్టి గ్లామర్ అపీరెన్స్.. సినిమాకి మంచి ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టాయి. మొత్తం ఈ రెండు రోజుల్లోనూ బంగార్రాజు చిత్రం రూ. 36కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించారు. ఆరేళ్ళ క్రితం సరిగ్గా సంక్రాంతి సీజన్ లోనే ఇదే డేట్లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసి నాగ్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అయిన బంగార్రాజు చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించడం విశేషమని చెప్పాలి. నాగార్జున, నాగచైతన్య తాతా మనవళ్ళుగా అందించిన వినోదాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి లాంగ్ రన్ లో బంగార్రాజు చిత్రం ఏ స్థాయిలో వసూళ్ళు తెచ్చుకుంటుందో చూడాలి.







