కోవిడ్ బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

UPDATED 20th JULY 2020 MONDAY 7:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): హోం ఐసోలేషన్ లో ఉంటున్న కరోనా పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న సేవల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వికాస కార్యాలయానికి సంబంధించిన భవనాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (డబ్ల్యు) జి. రాజకుమారితో కలిసి సోమవారం పరిశీలించారు. జిల్లాలో ఉన్న108 అంబులెన్స్ వాహనాలను కూడా ఈ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టరు వెంట డిఆర్ఒ సిహెచ్. సత్తిబాబు, వికాస పిడి కె. లచ్చారావు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us