పరవాడ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: పరవాడ మండలం ఫార్మాసిటీకి సమీపంలో ఉన్న ప్యాడి ఐవోసీఎల్ ఎల్పీజీ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వద్ద సోమవారం ఉదయం గ్యాస్ లోడ్‌తో ఉన్న ట్యాంకర్ లారీ బోల్తాపడింది. విశాఖ హెచ్‌పీసీఎల్ రిఫైనరీ నుంచి సుమారు 17.5 టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ను లోడ్ చేసుకొని ప్యాడి ఐవోసీఎల్ ప్లాంట్‌కు చేరుకొంది. ఆ సమయంలో ప్లాంట్‌లో లారీలు ఎక్కువగా ఉండటంతో కంపెనీ ప్రతినిధులు లారీని బయటే నిలపాలని చెప్పారు. దీంతో డ్రైవర్ కుమార్ లారీని రోడ్డు పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా అదుపుతప్పి బోల్తాడింది. సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారీ క్రేన్ సాయంతో లారీని అక్కడి నుంచి తొలగిస్తుండగా ట్యాంకర్‌నుంచి గ్యాస్ లీకవడంతో కంపెనీ ప్రతినిధులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ట్యాంకర్‌ను అక్కడి నుంచి తొలగించారు. గ్యాస్ లీక్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.







