నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

UPDATED 16th FEBRUARY 2018 FRIDAY 10:30 PM

సామర్లకోట: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి  ప్రజలకు సుస్థిర పాలన అందించాలనే లక్ష్యంతో నవరత్నపథకాలు ప్రకటించారని, ఆ పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ కో- ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలు అందరూ ఒక చోటకు చేరి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు రచ్చబండ ఎంతో దోహదం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కమిటీ సభ్యులు మండపాక సురేష్, మేడిద గంగరాజు, పార్టీ నాయకులు బిక్కిన సుబ్రహ్మణ్యం, తోట స్వామి, జక్కి నూకరాజు, ఐ. సత్యనారాయణ, పీతల రాజు, సన్నిబోయిన రామకృష్ణ, గుర్రాల దుర్గయ్య, తుమ్మల వాసు, శెట్టిబత్తుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us