అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: అమూల్ ఒక కంపెనీ కాదని.. పాలు పోసేవాళ్లే యజమానులని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాల సేకరణ చేస్తున్నామని చెప్పారు. జగనన్న పాలువెల్లువ పథకం ఇవాళ కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్ వర్చువల్‌గా పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘‘కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ పథకానికి శ్రీకారం చుట్టాం. దీని ద్వారా జిల్లాలోని పాడి రైతులకు మెరుగైన ధర లభిస్తుంది. ఈ పథకం ఇవాళ ఆరో జిల్లాలోకి ప్రవేశిస్తోంది. అమూల్ సంస్థ ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, ప.గో. జిల్లాల్లో పాల సేకరణ చేస్తోంది. పాల నుంచి చాక్లెట్ తయారు చేసే వ్యవస్థ అమూల్‌కు ఉంది. ప్రపంచలోనే ఎనిమిదో స్థానంలో అమూల్ సంస్థ ఉంది’’ అని జగన్ అన్నారు.







