Waltair Veerayya: వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య.. తగ్గేదే లే అంటోన్న సీనియర్స్!

Updated 16th December 2022 Friday 9:45 pm

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు పోటీగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ కూడా సంక్రాంతికే ల్యాండ్ అవుతుండటంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా షురూ చేశారు చిత్ర యూనిట్స్. ఇటీవల బాలయ్య ‘వీరసింహారెడ్డి’ నుండి సుగుణ సుందరి అంటూ రెండో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా, తాజాగా వాల్తేరు వీరయ్య మరో కొత్త పోస్టర్ వదిలి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే హైప్ క్రియేట్ చేశాడు. ఇలా ఇద్దరు సీనియర్ హీరోలు తమ సినిమా ప్రమోషన్స్ విషయంలో తగ్గేదే లే అంటూ దూసుకెళ్తుండటంతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా, ఈ సంక్రాంతి పండగకు ఏ హీరో పైచేయి సాధిస్తాడా అని అప్పుడే లెక్కలు కూడా వేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉండగా, మధ్యలో ఓ తమిళ హీరో కూడా వీరికి పోటీ వస్తుండటంతో సంక్రాంతి పండగ సీజన్ రసవత్తరంగా మారిపోయిందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక చిరంజీవి, బాలయ్య సినిమాల్లో ఒకే హీరోయిన్ శ్రుతి హాసన్ నటిస్తుండటం విశేషం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us