UPDATED 5 FEBRUARY 2022 SATURDAY 07:30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 3,396 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9మంది కోవిడ్ తో చనిపోయారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశంలో ఇద్దరు చొప్పున… చిత్తూరు, గుంటూరు, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఒక్కరోజే 13,005 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 78వేల 746 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 29వేల 838 కరోనా టెస్టులు చేసినట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.







