ఆదిత్యలో విజయవంతంగా ముగిసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్

UPDATED 20th DECEMBER 2017 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్- 2017 విజయవంతంగా ముగిసాయి. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షత వహించిన ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏ.యూ రీజియన్ ఆర్.జె.డి. సత్యనారాయణ మూర్తి, గౌరవ అతిధిగా  ఇనస్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ భానుమూర్తి రాజు హాజరైనారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థపై నమ్మకంతో ఈ పోటీలను నిర్వహించే భాద్యత తమకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలియచేశారు. విజేతలందరూ భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో పాల్గొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏ.యూ రీజియన్ ఆర్.జె.డి. సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్నిరంగాలలో ప్రవేశం కలిగిఉండాలని, నేటి పోటీ ప్రపంచంలో ప్రతీ విషయాన్ని ఆకలింపుచేసుకుని జ్ఞానం పొందాలన్నారు. క్రీడలు క్రమశిక్షణతో ఎదగడానికి, జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను సమర్ధవంతంగా అధిగమించి ముందుకు వెళ్లే సామర్ధ్యం అలవరచుకోవడానికి దోహదపడతాయన్నారు. ఇనస్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ భానుమూర్తిరాజు మాట్లాడుతూ ఇంతటి చక్కటి సౌకర్యాలు, వసతులు కలిగిన ఆదిత్య విద్యా సంస్థలు గతంలో రాష్ట్రస్థాయి పోటీలను కూడా సమర్ధవంతంగా నిర్వహించారని, క్రీడల పట్ల మంచి అభిరుచి గల ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఈ క్రీడలను విజవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేశారన్నారు. ఈ పోటీల్లో బాలికల బాడ్మింటన్ సింగిల్స్ విభాగం విజేతగా భీమన చంద్ర హారిక (గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్, కాకినాడ), రన్నర్ అప్ గా చొప్పవరపు అభిహరిక (ఆంధ్ర పాలిటెక్నిక్, కాకినాడ), బాలికల బాడ్మింటన్ డబుల్స్ విభాగం విజేతలుగా భీమన చంద్రహారిక, వైబోయిన అనిత  గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్, కాకినాడ), రన్నర్స్ గా చొప్పవరపు అభిహరిక, భీమవరపు యువ మాధురి (ఆంధ్ర పాలిటెక్నిక్, కాకినాడ), బాలుర బాడ్మింటన్ సింగిల్స్ విభాగం విజేతగా వాసంశెట్టి వేణుగోపాల్ (చైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ), రన్నర్ అప్ గా రాయుడు ఈశ్వర్ (బి.వి.సి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, బట్లపాలెం), బాలుర బాడ్మింటన్ డబుల్స్ విభాగం విజేతలుగా వాసంశెట్టి వేణుగోపాల్, మండపల్లి వీరకిరణ్ ( చైతన్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), రన్నర్స్ గా కొండపల్లి వీరవెంకట కళ్యాణ్, జుజ్జువరపు రత్నజాన్ (లేనోరా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్), బాలుర టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో మద్దాల సాయిదుర్గా శశిధర్ (ఆంధ్ర పాలిటెక్నిక్, కాకినాడ), రన్నర్ అప్ గా ఆకుల వెంకట సాయి తేజ (గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), డబుల్స్ విభాగంలో విజేతలుగా పల్లి పి.ఎస్.వి.వి.యశ్వంత్ శివకుమార్, ఆకుల వెంకట సాయితేజ (గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), రన్నర్స్ గా పోకనాటి నానాజీ, మద్దాల సాయిదుర్గా శశిధర్ (ఆంధ్ర పాలిటెక్నిక్, కాకినాడ), బాలికల చెస్ విభాగంలో విజేతగా రామిశెట్టి నాగశరణ్య (ఆంధ్ర పాలిటెక్నిక్, కాకినాడ), రన్నర్ అప్ గా గీసాల హిమశ్రీ (గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్, కాకినాడ), బాలుర చెస్ విభాగంలో విజేతగా మొగిలి చైతన్య సాయిరామ్ (బి.వి.సి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, బట్లపాలెం), రన్నర్ అప్ గా వక్కలంక వెంకట ఉమా సాయిరాం అవినాష్ (శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) గెలుపొందారు. అనంతరం విజేతలకు ముఖ్య అతిధులు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ శరభోజి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఏ. మాధవరావు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us