ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీకి అవకాశం ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉందని.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. తాను గెలిస్తే మాత్రం సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న నర్సాపురం వెళ్తున్నానని.. రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రెండు రోజులు పోలీసులు తనకు భద్రత కల్పించాలన్నారు. అమరావతి కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రఘురామ తెలిపారు.







