రెడ్ బీ న్యూస్, 20 జనవరి 2022: దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకునే క్రమంలో కానీ, మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించే విషయంలో కానీ సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ మొదలు సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వినియోగించి ప్రజలకు సందేశాలు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహాన కల్పించేందుకు ఇటీవల #IndiaFightsCorona పేరుతో ఒక ట్విట్టర్ పేజీని రూపోందించింది. ఈరోజు ఆ పేజీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో రూపోందించిన మీమ్ ను పోస్ట్ చేశారు.







