UPDATED 2nd SEPTEMBER 2017 SATURDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల జర్మనీకి చెందిన స్టీమ్ బీజ్ యూనివర్సిటీతో అవగాహనా ఒప్పందం జరిగినట్లు కళాశాల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రకారం తమ కళాశాల విద్యార్థులకు దూరవిద్య ద్వారా విద్యను అభ్యసించేందుకు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందుకు తమ విద్యాసంస్థలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు వారి పరిశోధనలు జర్మనీలో నిర్వహించుకునేందుకు, అలాగే ఆదేశానికి చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు ఇక్కడ పరిశోధనలు చేసుకునేందుకు ఇద్దరి మధ్య అవగాహనా ఒప్పందం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం జర్మన్ సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ మేనేజెమెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ బెర్ట్ రామ్, లోహా ముల్లర్, వంగపండు వెంకట నాగరాజు నేతృత్వంలో విద్యార్థులకు డిజ్రప్టివ్ ఇన్నోవేషన్ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. వినియోగదారుని అవసరాలు సాంప్రదాయ పద్ధతులు ఆధునిక విజ్ఞానాన్ని సమ్మిళితం చేసి నూతన పరికరాలను, సాంకేతికతను అభివృద్ధి చేయడం ఎలా అనే అంశంపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి , డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, హెచ్వోడీలు, ప్లేస్ మెంట్ హెడ్ బాబ్జి, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







