వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడండి

UPDATED 10TH MAY 2017 TUESDAY 1:00 PM

పెద్దాపురం : పెద్దాపురం పట్టణ పరిధిలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని ముస్లిం అంజుమన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఐదవ వార్డ్ తాడితోటలో గల టి ఎస్ నెంబర్ 611, ఒకటవ వార్డ్, బ్లాక్ నెంబర్ ఏడు లోగల వక్ఫ్ బోర్డు పీర్ల పంజా స్థలమును కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మోసపూరితమైన ఉద్దేశ్యంతో ప్రొక్లైనర్ తో  చదును చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణాలకు ప్రయత్నం చేస్తున్నారని ఆ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆర్డీవో కు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ విషయాన్ని తహసీల్దార్ గోగుల వరహాలయ్య దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దీంతో ఆయన పనులు నిలిపి వేయాలని ఆదేశించారని వక్ఫ్ బోర్డు సభ్యులు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు స్థలాలను రెవిన్యూ సిబ్బందితో సర్వే చేయించి వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని ఆర్డీవో కు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు. అలాగే ఈ విషయం పై ఎస్.ఐ  ఎ. కృష్ణ భగవాన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని,  వివాదాన్ని సర్వే అనంతరం పరిష్కరించుకోవాలని, అంతవరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆయన సూచించారు.  ఈ కార్యక్రమంలో ముస్లిం అంజుమన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముక్తార్ ఆలీ, ఉపాధ్యక్షుడు లియాఖత్ ఆలీ , కార్యదర్శి ఆషిక్ ఆలీ , జాయింట్ సెక్రటరీ ఎస్.కె.రఫీ, కోశాధికారి అబ్దుల్ నబీ, సభ్యులు ఎస్.కె. బాబూలాల్, జలీల్, షబ్బీర్ హుస్సేన్, అబిద్ ఆలీ, జాకీర్ హుస్సేన్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us