Ap News: పీఆర్‌సీతో పాటు అన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలి: ఉద్యోగ సంఘాల నేతలు

విజయవాడ (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021 : పీఆర్‌సీతో పాటు అన్ని డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు పశ్చిమ కృష్ణ జిల్లా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం బొప్పరాజు మాట్లాడుతూ.. ‘‘వెంకట్రామిరెడ్డి.. 13 లక్షల మంది ఉద్యోగుల అభిమానాన్ని తాకట్టు పెట్టవద్దు. ప్రభుత్వం కూడా వెంకట్రామి రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సచివాలయ ఉద్యోగులు వెంకట్రామిరెడ్డి వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. సాయంత్రం అధికారుల దగ్గర సమావేశం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి చెప్పారు. సమావేశం నిర్వహిస్తే 71 డిమాండ్లతో కూడిన పీఆర్‌సీపై చర్చించాలి. 11వ పీఆర్‌సీ సహా పెండింగ్ బకాయిలను వెంటనే ఇవ్వాలి’’ అని ఐకాస నేతలు డిమాండ్ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us