ఆదిత్యలో విజ్ఞానదాయకంగా సాగిన శిక్షణా తరగతులు

UPDATED 10th JUNE 2017 SATURDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో ఫాకల్టీ ఇంగ్లీష్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు విజ్ఞానదాయకంగా సాగాయి. కళాశాల హ్యూమానిటీస్ అండ్ బేసిక్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ టి. నీలిమ పలు సూచనలు సలహాలు అందించారు. అలాగే విశాఖపట్నంకు చెందిన గాయత్రి విద్యా పరిషత్ సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ ఎన్.బి.వెంకటేశ్వర్లు, స్టాటిస్టిక్స్ విత్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే అంశం పై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు అడిగిన సందేహాలకు ఆయన సమాధానాలతో సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ టి.కె. రామకృష్ణారావు మాట్లాడుతూ స్టాటిస్టిక్స్ విత్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే నూతన పాఠ్యాంశం రెండు రోజులు ఎంతో ఉత్సాహంగా విజ్ఞానదాయకంగా సాగిందన్నారు. అనంతరం డాక్టర్ వెంకటేశ్వర్లును జ్ఞాపిక, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. శ్రీనివాస్, హెచ్ ఓ డి లు, అధ్యాపకులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us