Crime News: వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన సుభానీ అరెస్టు

ఒంగోలు (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను....’ అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. గుప్తాపై దాడి చేసిన సుభానీని అరెస్టు చేసినట్టు డీఎస్పీ నాగరాజు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us