UPDATED 26th NOVEMBER 2022 9:32 AM
Prince : జాతిరత్నాలు సినిమాతో అందర్నీ నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనుదీప్ తన తర్వాతి సినిమాని ఏకంగా తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తో తెరకెక్కించాడు. శివకార్తికేయన్, ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క జంటగా దర్శకుడు కేవీ అనుదీప్ దర్శకత్వంలో ప్రిన్స్ సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 21న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజయింది.
ప్రిన్స్ సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గా ఓ మాదిరి విజయం సాధించింది. ఇందులో పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా కామెడీ కోసం సినిమాని చూసేవాళ్ళకి ప్రిన్స్ నచ్చుతుంది. తాజాగా ఈ సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లోకి వచ్చింది. సినిమా రిలీజయి నెలరోజులు అవ్వడంతో ఒప్పందం ప్రకారం ప్రిన్స్ సినిమా నవంబర్ 25 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. దీంతో థియేటర్లో మిస్ అయిన వాళ్ళు కామెడీ కోసం ఈ సినిమాని ఓటీటీలో చూసేయొచ్చు.







