దేవస్థానం అభివృద్ధే ధ్యేయం

Updated 16th April 2017 Sunday 1:00 PM

పెద్దాపురం: భక్తులపాలిట కొంగు బంగారం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం అభివృద్ధే పాలకమండలి ధ్యేయమని దేవస్థానం చైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మి నాని పేర్కొన్నారు. ఈ సందర్భం గా అమ్మవారి దేవస్థానంలో సుమారు రూ. మూడు లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 20  కె వి జనరేటర్ ను ఆమె ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఈ జనరేటర్ ను  ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపిపి గుడాల రమేష్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వివి పళ్ళంరాజు, టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్,  సర్పంచ్  కుంచే గాంధీ, ఉప సర్పంచ్ ఎలిశెట్టి చక్ర ప్రకాష్, పాలక మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us