ఆదిత్యలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

UPDATED 5th JUNE 2017 MONDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్నిసోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి కళాశాల ప్రాంగణంలోపెద్దఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యాన్నితగ్గించేందుకు ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలన్నారు. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలు సవాళ్లు ఇనుమడించాయని, పెరుగుతున్నజనాభా, తగ్గుతున్నఅడవులు పర్యావరణ వ్యవస్థల విధ్వంసం వంటి అనేక కారణాలు ప్రకృతిని ప్రమాదంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ అధిక సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ వల్లెం శ్రీనివాసరావు, ఎస్.రమాశ్రీ, ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us