UPDATED 9th JUNE 2018 SATURDAY 7:00 PM
రాజమహేంద్రవరం: నిరుపేద కుటుంబాలను బిజెపి ప్రభుత్వం అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ అన్నారు. స్థానిక 32వార్డులోని జాంపేట వద్ద మరణించిన బిరుగుకంటి శ్రీను కుటుంబ సభ్యులకు ఫ్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం ద్వారా రూ. రెండు లక్షల చెక్కును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకంలో సభ్యత్వం తీసుకోవడం వలన కష్టకాలంలో కుటుంబానికి ఆర్ధికంగా ఎంతో భరోసా కలుగుతుందని, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇటువంటి పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తుందని, పేదల అభివృద్దే భారతీయ జనతా పార్టీ ధ్యేయమని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ బాల సుబ్రహ్మణ్య సింగ్, మాట్టాడి చిన్ని, రౌతు వాసు, చర్చిపేట పండు, బుజ్జి, చిన్ని, లక్ష్మి, రాజేశ్వరి, లావణ్య, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







