ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నివారించండి

UPDATED 30th OCTOBER 2017 MONDAY 5:00 PM

పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ పరిధిలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ పెద్దాపురం సోషల్ మీడియా ఫర్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆర్డీవో వి.విశ్వేశ్వరరావుకు సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంగా మారిపోయిందని, నిరంతరం ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజల ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయిందన్నారు. అలాగే  పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీలు యథేచ్ఛగా వదులుతున్న వ్యర్ధ జలాలు దుర్వాసనను వెదజల్లడంతో పాటు దట్టంగా పొగను కూడా విడుదల చేస్తున్నాయని, దీంతో ప్రజలు ఇళ్ళల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ విచ్చలవిడిగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడంలేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే  ప్రజలు మరింత అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఫర్ సొసైటీ సభ్యులు ఎండీ ముక్తార్ అలీ, కొల్లి దుర్గా ప్రసాద్, వై. రమేష్, జి.శివ ప్రసాద్, శివ కుమార్, జి. బాబ్జీ, టి. శ్యామ్, కె. రవి కుమార్, ఎ. బుజ్జి, వి.సురేష్, కె. నూకరాజు, ఎ. దుర్గాప్రసాద్, సూర్య భాస్కర్, ఆర్. మణికంఠ, దారపురెడ్డి క్రాంతి, డి. సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us