Bheemla Nayak: పొలిటికల్ గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉండగా.. కరోనా కారణంగా విడుదల లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే భీమ్లా నాయక్ ట్రైలర్‌ను విడుదల చేసే పనిలో ఉన్న మూవీ టీమ్. లేటెస్ట్‌గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.
ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చి అభినందించారు సెన్సార్ సభ్యులు. ఈ సినిమా మలయాళం సినిమా అయ్యప్పన్ కోషియమ్‌కి రీమేక్‌గా తెరకెక్కింది. సినిమా కూడా చాలా బాగా వచ్చిందని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రేపు (ఫిబ్రవరి 19న) రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.







