కానిస్టేబుల్‌ తీరుతో వాలంటీరు బలవన్మరణం

శ్రీకాళహస్తి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: పెళ్లయిన విషయాన్ని తెలియకుండా ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన శ్రీకాళహస్తిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తెనాలికి చెందిన సాంబశివరావు శ్రీకాళహస్తిలోని దక్షిణ కైలాస్‌నగర్‌లో స్థిరపడ్డారు. ఆయన కుమార్తె ఉమామహేశ్వరి(24) తొమ్మిదో వార్డు వాలంటీరుగా పనిచేస్తోంది. తొట్టంబేడు మండలం చేమూరుకు చెందిన కానిస్టేబుల్‌ ప్రసాద్‌ శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రొటోకాల్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను ఉమామహేశ్వరితో ప్రేమయాణం సాగించాడు. అతని మరో యువతిని ప్రేమిస్తున్నాడని, ఇప్పటికే మరొకరితో వివాహమైనట్లు ఉమామహేశ్వరి ఇటీవల తెలుసుకుంది. ఈ విషయమై మాట్లాడటానికి ఆమె తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం పట్టణంలోని భరద్వాజతీర్థం వద్దకు వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి సాంబశివరావుపై ప్రసాద్‌ చేయిచేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని ఉమామహేశ్వరి ఇంట్లో ఉరివేసుకుంది. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించారు. శ్రీకాళహస్తి రెండో పట్టణ సీఐ భాస్కర్‌నాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసాద్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రసాద్‌ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us