పాత్రికేయుడి మృతికి ఏపీయూడబ్ల్యూజే సంతాపం

UPDATED 11th NOVEMBER 2017 SATURDAY 6:30 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం సాక్షి రిపోర్టర్ కె. గుర్రాజు అకాల మరణానికి  పెద్దాపురం నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే సంఘం శనివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. స్థానిక సమాచార పౌర సంబంధాలశాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సంతాప సభలో గుర్రాజు చిత్రపటానికి సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పెద్దాపురం ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు బూరాడ శ్రీనివాసరావు, రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య) మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. గుర్రాజు కుటుంబానికి ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుందని పేర్కొన్నారు.  అనంతరం సీనియర్ పాత్రికేయుడు, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు అడపా వెంకట్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి గుర్రాజు చేసిన సేవలను కొనియాడారు.అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, జిల్లా సహాయ కార్యదర్శి మాసా  చంద్రరావు (చందు), ఈసీ మెంబర్ పెమ్మాడి వీరభద్రవర్మ, కార్యనిర్వాహక కార్యదర్శి దేవరకొండ సుధాకర్, ఇర్షాద్ ఆలీ, వినాయక్, తదితరులు పాల్గొన్నారు..
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us