మున్సిపల్ కమీషనర్ గా శేషాద్రి

UPDATED 17TH MAY 2017 WEDNESDAY 11:30 AM

పెద్దాపురం: పెద్దాపురం మున్సిపల్ కమీషనర్ గా బిఆర్ శేషాద్రి బాధ్యతలు బుధవారం స్వీకరించారు. విశాఖపట్టణం నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకు కమీషనర్ గా పనిచేసిన  ఏ. వెంకటరావు గుంటూరు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన కమీషనర్ విలేఖరులతో మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే పట్టణ ప్రజలకు అన్నివిధాలా తన సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని, ముఖ్యంగా ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిల్ సభ్యులతో కలిసి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే పట్టణ ప్రజలకు పురసేవా యాప్ పై మరింత అవగాహన కల్పిస్తానని  అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు ను మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us