‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే!

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్‌ 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించినప్పటికీ.. ప్రముఖ సినీ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు కొన్ని అనుకోని కారణాల వల్ల ట్రైలర్‌ విడుదల వాయిదా వేశారు. తాజాగా ట్రైలర్‌ను డిసెంబరు 9న ఉదయం 10గంటలకు థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us