హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జంటగా నిత్యా మీనన్ నటిస్తుండగా, దగ్గుబాటి రానా కు జంటగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాట లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరి పోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావడం తో ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది, అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటం తో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుండి మరో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసే ఉద్దేశంలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది, ఈ నెల 20 వ తేదీ న భీమ్లా నాయక్ సినిమా నుండి ఒక పాటను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక భీమ్లా నాయక్ సినిమా నుండి కేవలం రెండు పాత్రలు మాత్రమే విడుదల కావాల్సి ఉంది, ఈ రెండు పాటలలో లో ఒక పాట ను పవన్ కళ్యాణ్ పాడినట్లు తెలుస్తుంది, మరి ఈ ఈ సారి విడుదల చేయబోయే పాట పవన్ కళ్యాణ్ పాడిందా.? లేక వేరే పాట అనేది తెలియాల్సి ఉంది.







