Goods Train Derailed : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లు రద్దు

UPDATED 9th NOVEMBER 2022 WEDNESDAY 11:15 AM

Goods Train Derailed : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కోల్‌కతా-చెన్నై రహదారిలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్‌పై మరమ్ములు చేస్తున్నారు. కాగా, గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో దక్షిణమధ్య రైల్వే తొమ్మి రైళ్లను రద్దు చేసింది. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.

విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. విజయవాడ-విశాఖపట్నం, విశాఖ-విజయవాడ, గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us