విత్తన శుద్ధితో అధిక దిగుబడులు

UPDATED 14th JUNE 2017 WEDNESDAY 5:00 PM

పెద్దాపురం: రైతులు విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారానే అధిక దిగుబడులు సాధించవచ్చని ఆచార్య ఎన్.జి. రంగా యూనివర్సిటీ, ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ రైతులకు సూచించారు. పెద్దాపురం మండలం కాండ్రకోట, ఉలిమేశ్వరం గ్రామాల్లో రిలయన్స్ ఫౌండేషన్, ఏరువాక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సంచార విజ్ఞాన వాహనం (నాలెడ్జి ఆన్ వీల్స్) ద్వారా నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతులు తొలకరి వర్షాలను ఉపయోగించుకుని లోతు దుక్కులు చేపట్టాలన్నారు. నారుమడులు పోసుకునే ముందు మొలక శాతాన్ని పరీక్షించుకోవాలన్నారు. స్వర్ణ, ఇంద్ర, పుష్యమి, సాంబా మసూరి, ఆర్పీ బయో విత్తన రకాలు సార్వాకు అనుకూలమని సూచించారు. అలాగే నారు మడిలో సిఫార్సు చేసిన ఎరువులను ఉపయోగించాలని పేర్కొన్నారు. అనంతరం రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ సి.హెచ్.వరహాలు మాట్లాడుతూ పంటలకు సంబంధించి రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా గ్రామగ్రామానా అనేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని, రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ కృషి చేస్తోందని ఆమె సూచించారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ రైతులకు సూచనలు,  సలహాలు అందించేందుకు 18004198800 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసిందని ఉదయం 9.30 నిముషాల నుంచి సాయంత్రం 4.30 నిముషాల వరకు సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us