Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

తిరుమల (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క, తమిళనాడు మంత్రి గాంధీ, గుజరాత్‌ మంత్రి జితేంద్ర చౌదరి, సినీ నటుడు సాయికుమార్‌, నటి కంగనా రనౌత్, దర్శకుడు అనిల్‌ రావిపూడి స్వామివారి సేవలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి వచ్చిన ప్రముఖులకు రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు నేతలు, ప్రముఖులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us