రెడ్ బీ న్యూస్, 30 డిసెంబర్ 2021: కరోనా వైరస్ డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య సునామీ వలే వైద్య వ్యవస్థను ముంచెత్తనుంది. గత వారంలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా రోజువారీ కేసులు పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. డెల్టా వేరియంట్ నుంచి పూర్తిగా తేరుకోని ప్రపంచాన్ని.. ఇప్పుడు ఒమిక్రాన్ చుట్టేసింది. అమెరికా, ఫ్రాన్స్, యూకే, డెన్మార్క్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవున్నాయి. భారత్‌లో కూడా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. కొత్త కేసులు హఠాత్తుగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా పలు దేశాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ‘డెల్టా వ్యాప్తి కొనసాగుతోన్న సమయంలోనే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తూ.. కేసుల సునామీని సృష్టిస్తోంది. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇది వైద్య వ్యవస్థలు, ఇప్పటికే అలసిపోయి ఉన్న వైద్య సిబ్బందిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోంది’ అని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్ వ్యాఖ్యానించారు.







