కిట్స్ లో భావవ్యక్తీకరణపై అవగాహన సదస్సు

UPDATED 23rd SEPTEMBER 2017 SATURDAY 7:00 PM

పెద్దాపురం: విద్యార్థులు భావవ్యక్తీకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రత్తిపాడు జూనియర్ సివిల్ జడ్జి జె. శ్రావణ్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ పై నిర్వహించిన అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై శనివారం మాట్లాడారు. విద్యార్థులు వ్యక్తిత్వ వికాసానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, దేశం గర్వించదగిన ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. అలాగే విద్యార్థి దశ నుంచి సామాజిక స్పృహను పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు ఎప్పటికప్పుడు నూతన విషయాలపై అవగాహన కల్పించడంతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం, సామాజిక స్పృహ మొదలైన విషయాలపై అవగాహన కల్పిస్తూ వారికి అన్ని విధాలా తమ ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ, ఏవో కె.ఆర్. సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, హెచ్ వో డీ సర్వం, ప్రొఫెసర్లు శాంతి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us