AP News : ప్రత్యేకహోదాపై మాయమాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్‌లు వద్దు : చంద్రబాబు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని.. రోజురోజుకీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటు కూడా వస్తుందని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై వైకాపా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేకహోదా తీసుకొస్తామని.. అలా చేయని పక్షంలో రాజీనామా చేస్తామని సీఎం జగన్‌ గతంలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. నాడు ప్రజలు, యువతకు హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు సాధించలేకపోయారని చంద్రబాబు నిలదీశారు. ఇది మోసం, దగా కాదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై వైసీపీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని.. అందరం కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాడదామన్నారు. ఈ సవాలుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మాయ మాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్‌లు వద్దని చంద్రబాబు హితవు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us