Updated 5th May 2023 Friday 1:05 am
Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం ముంచెత్తుతోంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనాలుదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నగరంలోని పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, బంజారాహిల్స్ లో కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రానున్న మరో రెండురోజులపాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
హైదరాబాద్ ను వరుణుడు వదలడం లేదు. ఉదయం భానుడు సాయంత్రం వరుణుడు హైదరాబాద్ పై పగబట్టారు. ఉదయమంతా ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తే.. సాయంత్రం వరుణుడు కుండ పోత వాన కురిపిస్తున్నాడు. దీంతో రాత్రి పూట భారీ వర్షం పడుతోంది.
మరోసారి భాగ్యనగరంలో వాన దంచికొట్టింది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. భారీ వర్షానికి విత్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేక పలు బస్తీలు అంధకారంలో ఉన్నాయి.







