అన్నవరం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: కేంద్ర పథకం ప్రసాద్‌ ద్వారా నిధులకు ప్రతిపాదనలు, బృహత్తర ప్రణాళికపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్షించారు. సత్యదేవుని దర్శనానికి గురువారం ఆయన కుటుంబంతో వచ్చారు. ఈవో త్రినాథరావు, ఆర్జేసీ సురేష్‌బాబు స్వాగతం పలికారు. ఆపై ఎమ్మెల్యే పర్వతతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రస్తుత అభివృద్ధి పనులు, నిర్మాణాలపై మంత్రికి ఈవో వివరించారు. ప్రసాద్‌ పథకం ద్వారా వచ్చే నిధులతో పనులు చేపట్టాక ఇంకా ఏమైనా చేయాలంటే ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us