UPDATED 12th FEBRUARY 2018 MONDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సిఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఐ.ఎస్.టి.ఇ సహకారంతో ఐటి, ఎంసిఏ విద్యార్థులకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే అంశంపై రెండురోజులు వర్క్ షాప్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించిన ఉప్పలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో అనేక విభాగాల్లో గల కంప్యూటర్ ఫైల్స్, సేవలకు సైబర్ సెక్యూరిటీ కల్పించవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తులో అవసరాలు, అవకాశాలకు బ్యాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవడం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఇ, ఐటి విభాగం తృతీయ సంవత్సరం విద్యార్థులకు నాలుగురోజులు పాటు "ఆప్ థాన్" పేరిట నిర్వహించిన బెంగళూరుకు చెందిన ప్రముఖ కంపెనీ సినెక్సాస్ సాఫ్ట్ వేర్ డెవలపర్ కె. బాల శశిధర్ బృందం నూతన ప్రాజెక్ట్ అభివృద్ధిపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫసర్ ఎ. రామకృష్ణ, ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, విభాగాధిపతులు ఎం. అనిల్ కుమార్, ఆర్.వి.వి.ఎన్. భీమారావు, బి. మాణిక్యాలరావు, ఎ. వానతి, ఎం. రాజబాబు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







