Special Status:ఏపీకి ప్రత్యేక హోదా..కేంద్ర కమిటీ ఎజెండాలో తొలగింపుపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి జీవీఎల్ లేఖ

UPDATED 14th FEBRUARY 2022 MONDAY 02:40 PM

అమరావతి: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు బీజేపీ నేత..జీవీఎల్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ సబ్ కమిటీ సమావేశ అజెండా నుంచి ప్రత్యేకహోదాతో పాటు కొన్ని అంశాల తొలగింపుపై ప్రకటన విడుదల చేయాలని లేఖలో కోరారు. అజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయడానికి మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. విభజన చట్టానికి సంబంధం లేని నాలుగు అంశాలను పొరపాటున అజెండాలో పెట్టారని… ఏపీకి మాత్రమే సంబంధించిన అంశాలను మనం మాట్లాడుకుంటే సరిపోతుందని..అలాగే ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు సంబంధం లేదని జీవీఎల్ స్పష్టంచేశారు.

ఈ విషయాన్ని వైసీపీ, టీడీపీ, సీపీఎం రాజకీయ కోణంలో చూస్తున్నాయని..సవరించిన అజెండాతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందని జీవీఎల్ స్పష్టంచేశారు. అజెండాలో తొలగించిన అంశాలపై 17న జరిగే సమావేశంలో వివరించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల విభజన హామీల అంశంపై దృష్టి పెట్టిన కేంద్రం దానిపై ఓ ముగ్గురు సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే.ఈ కమిటీలో చేర్చిన అంశాలను చర్చించి వాటిని అమలు చేసేశాల చూడాలని హోంశాఖకు రాసిన లేఖలో జీవీఎల్ కోరారు.

ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని తొలుత ప్రస్తావించింది బీజేపీనే అని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఏపీ విభజన చట్టం పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసిన సంగతి తెలిసిందే...ఈ కమిటీ అజెండాలో తొలుత ప్రత్యేకహోదా అంశాన్ని పెట్టినప్పటికీ ఆ తర్వాత తొలగించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us