ఆదిత్యలో ఘనంగా అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

UPDATED 12th AUGUST 2017 SATURDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో అంతర్జాతీయ యువజన దినోత్సవ, గ్రంథ పాలకుల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస రెడ్డి గ్రంధాలయ పితామహుడు, ఆధునిక గ్రంధాలయ రూపకర్త ఎస్.ఆర్.రంగనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. యువజన దినోత్సవాలను పురస్కరించుకుని కళాశాల ఎన్ ఎస్ ఎస్ సేవా విభాగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (కాకినాడ) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 300 మంది రక్త దానం చేశారు. యూత్ బిల్డింగ్ పీస్ అనే అంశంతో పలు కార్యక్రమాలను సైతం నిర్వహించారు. వకృత్వ, వ్యాస రచన, డ్రాయింగ్, చిత్రలేఖనం, ప్యానల్ డిస్కషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ రమాశ్రీ, గ్రంధాలయాధికారి అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us