Kushi : ఓటీటీలోకి వచ్చేస్తున్న ఖుషి.. ఎప్పుడు? ఎక్కడ?

Updated 24th September 2023 Sunday 10:50 am

Kushi Movie :  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా మాత్రం అనుకున్నంత కలెక్షన్స్ రాలేదని సమాచారం. సినిమా రిలీజ్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ చేశాడు.

ఇక ఇటీవల ఏ సినిమా అయినా థియేటర్స్ లో రిలీజయిన నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖుషి సినిమా కూడా ఓటీటీ బాట పట్టనుంది. ఖుషి సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది ఖుషి సినిమా.

దీంతో విజయ్, సమంత అభిమానులు సినిమాని మరోసారి ఓటీటీలో చూడటానికి రెడీ అయిపోయారు. థియేటర్స్ లో సినిమా మిస్ అయిన వాళ్ళు ఖుషి ఓటీటీ రాక కోసం చూస్తున్నారు. మరి ఖుషి సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us