అంగరంగ వైభవంగా నూకాలమ్మ పూలగరగ ఉత్సవం

UPDATED 25th FEBRUARY 2018 SUNDAY 7:00 PM

పెద్దాపురం: భక్తుల కొంగు బంగారం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి పూలగరగ ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. దేవస్థానం ఛైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మినాని, కార్య నిర్వహణాధికారి పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. పూలగరగ ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన పుష్పాలతో గరగలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి గరగలను గత కొన్ని సంవత్సరాలుగా పెద్దాపురం మహారాజా కోటకు తీసుకువెళ్లి సంబరం చేసి తిరిగి కట్టమూరు గ్రామం మీదుగా తిరిగి కాండ్రకోట చేరుకొని రాత్రి తెల్లవార్లు సంబరం చేసి అమ్మవారిని ఇంటింటికి తీసుకురావడం గత కొన్ని వందల సంవత్సరాలుగా ఆచారంగా వస్తోంది. మేళతాళాలతో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంచే గాంధీ, ఉప సర్పంచ్ ఎలిశెట్టి చక్ర ప్రకాష్, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు సావిటి నాగేశ్వరరావు, బొజ్జ వెంకట్రాజు, గవరసాన వెంకట్రాజు, ఉద్దగిరి అర్జున్, అరట్ల బుల్లబ్బాయి, మింగి వీరబాబు, రంగనాధం శ్రీను, గుద్దటి ధర్మరాజు, వేమవరపు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది పుర్రె అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.      
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us