Last Film Show : ఆస్కార్ నామినేటెడ్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తుంది..

UPDATED 22nd NOVEMBER 2022 TUESDAY 6:10 AM

Last Film Show : ఈ సంవత్సరం మన దేశం నుంచి స్టార్ సినిమాలు, కలెక్షన్స్ సాధించిన సినిమాలు, భారీ హిట్ కొట్టిన సినిమాలు కాకుండా ఒక చిన్న సినిమాని ఆస్కార్ కి పంపించారు. గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ సినిమా ఈ సంవత్సరం మన దేశం నుంచి ఆస్కార్ కి నామినేట్ అయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లీష్ సినిమా ‘ది లాస్ట్‌ షో’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

చిన్న వయసులోనే సినిమాతో ప్రేమలో పడిన ఓ కుర్రాడి కథగా ‘ఛెల్లో షో’ తెరకెక్కింది. ఇటీవలే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దర్శకుడు పాన్ నలిన్‌ ఈ సినిమాని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పాపులర్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో ఛెల్లో షో సినిమా నవంబర్‌ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. ఛెల్లో షో సినిమా పోస్టర్ ని తమ ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ”మీ కోసం ఒక అద్భుతమైన ప్రకటన చేస్తున్నాం.. ఒక గొప్ప సినిమాటిక్ అనుభవం కలిగించే లాస్ట్ ఫిల్మ్ షో సినిమా, 95వ ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం కోసం భారతదేశం నుంచి అధికారికంగా ఎంపిక అయిన ఈ సినిమా నవంబర్ 25 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, గుజరాతీలో స్ట్రీమింగ్ అవ్వనుంది” అని తెలిపింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us