Pawan Kalyan : ఏపీ 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు- వాలంటరీ వ్యవస్థపై పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు

Updated 9th July 2023 Sunday 11:10 pm

Pawan Kalyan – Eluru : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాలంటరీ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణ జరుగుతోందని, ఇందుకు కారణం వైసీపీ వాలంటరీ వ్యవస్థ అని, ఇందులో వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. ఈ విషయం కేంద్ర నిఘా వర్గాలే నాతో చెప్పాయని పవన్ అన్నారు.

చెత్త ఎత్తే వాళ్ళపై కూడా చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. గెలుపోటములు నాకు తెలీదు. పోరాటం మాత్రమే తెలుసు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారు. వారిలో 14వేల మంది తిరిగి వచ్చారని చెప్తున్నారు. మిగిలిన వారి సంగతేంటి? మీ ఇంట్లో ఆడపడుచు అదృశ్యమైతే ఇలాగే ఉంటావా జగన్? దీనిపై జగన్, డీజీపీ ఎందుకు సమీక్ష చేయలేదు? ఆడబిడ్డల ఉసురు తీస్తున్నారు జగన్.

చెత్త పన్నుతో సహా అన్ని పన్నులతో దోచేస్తున్న జగన్ దారి దోపిడీ దొంగలతో సమానం. ఎండిపోయిన గుండెలు నాయకుల కోసం చూస్తాయి. అలా జగన్ కోసం చూశారు. కానీ జగన్ ఏం చేశాడు? 18 ఏళ్ల వయసులో 25 ఏళ్ళు నిండకుండానే చనిపోతా అనుకున్నా. ఎందుకంటే నాలో ఉన్న జ్వలనం పోరాటం.

నేను చావడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా. నన్ను గెలిపించినా లేకున్నా ఈ నేల కోసం పోరాడతా. మళ్లీ ఓడినా పవన్, జనసేన పోరాటం ఆగదు. ప్రాణాలకు తెగించి ఉన్న నాకు, నా వాళ్ళని తిట్టినా పట్టించుకోను. నువ్వు విలువలు లేని వాడివి. నువ్వో క్రిమినల్. అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకాలు పోవాలన్నా, జనం బాగుండాలన్నా జగన్ పోవాలి. హలో ఏపీ… బై బై వైసీపీ” అని పవన్ అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us