Pushpa Movie : పుష్ప మొదలుపెట్టి రెండేళ్లు.. రిలీజయి వన్ ఇయర్.. అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తారా??

UPDATED 13th NOVEMBER 2022 SUNDAY 10:30 AM

Pushpa Movie : రెండేళ్ల క్రితం రంగంలోకి దిగాడు పుష్పరాజ్. సరిగ్గా రెండేళ్ల క్రితం సుకుమార్ డైరెక్షన్లో స్టార్ట్ అయిన పుష్ప ఇండియాని షేక్ చేసింది. మామూలు కూలీగా బరిలోకి దిగిన పుష్ప ప్రపంచాన్ని ఏలడానికి రెడీ అయ్యాడు. పుష్పతో ఆడిడియన్స్ ని తన మాయలో పడేశాడు బన్నీ. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా తన మేనరిజమ్స్ తో ఎట్రాక్ట్ చేశాడు. ఎక్కడ చూసినా పుష్పరాజ్ మానియాతో తగ్గేదేలే అనిపించాడు.

సరిగ్గా రెండేళ్ల క్రితం అడవుల్లోకి వెళ్లిన పుష్పరాజ్ సంవత్సరానికి బయటికొచ్చాడు. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక జంటగా రెండేళ్ల క్రితం 2020 నవంబర్ 12న షూటింగ్ మొదలుపెట్టిన పుష్ప ఆల్ ఇండియా వైడ్ రికార్డులు క్రియేట్ చేసింది. నార్త్ లో కలెక్షన్ల రికార్డులు బద్దలుకొట్టింది. అసలు నార్త్ నేటివిటీకి ఏమాత్రం సంబందం లేని స్టోరీతో, స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన పుష్ప సౌత్ లో ఎంత సక్సెస్ అయ్యిందో బాలీవుడ్ లో కూడా అదే రేంజ్ సక్సెస్ సాధించింది.

పుష్పగా బన్నీ యాక్టింగ్ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నారు ఆడియన్స్. అసలు తగ్గేదేలే అన్న ఆ మ్యానరిజమ్ కి ఫిదా అయిపోయారు ఫాన్స్. ఒక్కటేంటి.. పుష్పకి సంబందించి సినిమాలో ప్రతీ సీన్, ప్రతీ సాంగ్, ప్రతీ ఎమోషన్, ప్రతీ యాక్టర్.. ఆడియన్స్ మీద విపరీతంగా ఇంపాక్ట్ చూపించాయనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఆడియన్స్ చేత స్టైలిష్ స్టార్ అనిపించుకున్న బన్నీ తన లుక్ నుంచి డ్రెస్సింగ్, హెయిర్ ఇలా అన్నింటినీ మార్చి డీగ్లామర్ లుక్ లో ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చి పుష్పరాజ్ గా శభాష్ అనిపించుకున్నాడు.

బన్నీ కెరీర్ లోనే ఈ రేంజ్ యాక్టింగ్, ఎమోషన్స్ చూపించిన సినిమా పుష్ప. హై ఎలివేషన్ తో పాటు సూపర్ యాక్షన్ తో పుష్పరాజ్ గా ఎంటర్టైన్ చేశాడు బన్నీ. పుష్పరాజ్ గా తెగ ఫేమస్ అయిపోయాడు బన్నీ. అంతకముందు సౌత్ మాత్రమే ఆక్యుపై చేసిన బన్నీ పుష్పతో నార్త్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. దాంతో వరస పెట్టి అవార్డులు అందుకుంటున్నాడు. ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు జీక్యూ అవార్డు అందుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. పుష్ప మానియా ఇంకా తగ్గకపోవడంతో సెకండ్ పార్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us