UPDATED 2nd JANUARY 2018 TUESDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎన్.ఎస్.ఎస్. విద్యార్థుల బృందం వోడీఎఫ్ పై సర్వే నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగంపేట మండలం దొడ్డిగుంట, సింగంపల్లి గ్రామాల్లో రెండు రోజులు పాటు నిర్వహించిన ఈ సర్వేలో అధికశాతం కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉన్నప్పటికీ వాటిని వినియోగించడం లేదని, కొన్ని అసంపూర్తి నిర్మాణం కలిగి నిరుపయోగంగా ఉన్నాయన్నారు. తమ ఎన్.ఎస్.ఎస్. బృందం 75 శాతం వివరాలు సేకరించి, బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే దుష్ప్రభావాలను కరపత్రాల ద్వారా ప్రజలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్లు శివకుమార్, జ్ఞానవర్ధన్, 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు.







