విద్యార్థులు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి

UPDATED 3rd AUGUST 2017 THURSDAY 5:00 PM

గండేపల్లి: విద్యార్థులు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ వాడకం వాటి వల్ల కలిగే దుష్పరిణామాలపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన గురువారం మాట్లాడారు. డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని, వాటికి బానిసైతే విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని సూచించారు. యావత్ భారతదేశాన్నిపట్టి పీడిస్తున్నఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన భాద్యత విజ్ఞానవంతులైన విద్యార్థుల పైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. అనంతరం ఎన్ ఐ ఐ టి  కాలికట్ కు చెందిన పి. సతీష్ మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 400 మందిలో ఒకరు డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, ముఖ్యంగా యువత మత్తు పదార్దాలకు అలవాటు పడకుండా ఆరోగ్యవంతంగా జీవించా లన్నారు. అనంతరం విద్యార్థులచే మత్తు పదార్థాలకు బానిస కామని, అలాగే ఎవరినీ బానిసలు కానీయమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us