UPDATED 31st MAY 2018 THURSDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంకు వారిచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో బ్లడ్ బ్యాంకులలో బ్లడ్ ప్యాకెట్ల కొరత కారణంగా రోటరీ క్లబ్ వారి ప్రత్యేక అభ్యర్ధనతో ఈ అత్యవసర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆదిత్య సిబ్బంది పాల్గొన్న ఈ శిబిరంలో 65 మంది రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య కాలేజ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ .వి. శ్రీనివాసరావు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, వివిధ విభాగాధిపతులు, రోటరీ బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు డాక్టర్ కామరాజు, తదితరులు పాల్గొన్నారు.







