వ్యాపారుల ఇబ్బందులను పరిష్కరించండి

UPDATED 15th FEBRUARY 2018 THURSDAY 8:00 PM

సామర్లకోట: ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేసినప్పటి నుంచి వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మున్సిపల్ కమీషనర్ కు పట్టణ వ్యాపారులు విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో ఒకవైపు జీఎస్టీ మరొకవైపు  అపరాధ వడ్డీ విధించడం తమకు భారంగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాపులు లీజుదారులు మున్సిపల్ కమిషనర్ సి. వెంకటేశ్వరరావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అలాగే బకాయిలపై రెండు నుంచి రెండున్నర శాతం వడ్డీ విధించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కమీషనర్ మాట్లాడుతూ ఇది తమ చేతుల్లో లేదని కౌన్సిల్ దృష్టిలో ఉంచి ప్రభుత్వానికి నివేదిక పంపి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కె.డబ్ల్యు. జయకర్, మున్సిపల్ సిబ్బంది, అలాగే స్టేషన్ సెంటర్, నూకాలమ్మ గుడి, మార్కెట్ సెంటర్లోని షాపుల యజమానులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us