UPDATED 10th DECEMBER 2018 MONDAY 6:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలో ఏర్పాటు చేసిన వెంచర్ డవలప్ మెంట్ సెంటర్ (విడిసి)ని బోస్టన్ లో గల నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, సెంటర్ ఫర్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ గ్రెగ్ కొలియర్, సెంటర్ ఫర్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ క్రిష్ వాంజీగెడ సోమవారం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, విద్యా సిలబస్ తో వెంచర్ డవలప్ మెంట్ ప్రోగ్రాం అనుసంధానం చేసే అంశంపై గైట్ ప్రాంగణంలోని కళాశాలల ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఔత్సాహికులైన విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన శిక్షణ విడిసి ద్వారా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈనెల 18వ తేదీన విజయవాడలో జరిగే గ్రాండ్ ఫినాలేలో పాల్గొని స్మార్ట్ ఐడియాస్ ను ప్రదర్శించాలని కోరారు. అందులో అర్హత పొందిన వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహకాలు అందచేయడంతో పాటు యుఎస్ఎలోని బోస్టన్ యూనివర్సిటీకి వాటిని పంపి పెట్టుబడులు ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివి ప్రసాద్, డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, డాక్టర్ ఎండి ధనరాజు, వల్లీమాధవి, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, గైట్ విడిసి ఇంచార్జ్ పి.ఆర్.కె. రాజు, కోఆర్డినేటర్ వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్ మెంట్ కౌన్సిల్ వెంచర్ కోచ్ తరుణ్ కుమార్, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.







