UPDATED 29th OCTOBER 2022 FRIDAY 10:10 PM
Nimmakayala Chinarajappa : రుషికొండపై నిరసన తెలిపేందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్న మాజీ హోంమంత్రి చినరాజప్ప (Nimmakayala Chinarajappa)ను సామర్లకోట (Samarlakota) మండలం అచ్చంపేట (Atchampeta)లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు..దీంతో ఆయన తన కార్యకర్తలతో కలిసి ఇంటి ముందు భైఠాయించారు.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ (TDP) పోరుబాట (Porubata) కార్యక్రమాన్ని సీఎం జగన్ వైసీపీ మంత్రులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.
జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.. పోరుబాటకు బయలుదేరుతున్న టీడీపీ నేతలు నిర్బంధించడాన్ని బట్టి చూస్తే జగన్ అరాచకపాలక స్పష్టమవుతోందనని, ప్రశ్నించే గళాలపై జగన్ పోలీసులతో చేయిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోరుబాటను విజయవంతం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రాజప్ప పిలుపునిచ్చారు...







