శ్రీశైలం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయంలో ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ఆధార్ తప్పనిసరి చేశారు. భక్తులు ఆధార్ కార్డు తీసుకురావాలని ఆలయ ఈవో స్పష్టం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం, అభిషేకం టికెట్లకు ఆధార్ తప్పనిసరి అని చెప్పారు. టికెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతోనే ఆధార్ నిబంధన తెచ్చామని, భక్తులు సహకరించాలని కోరారు.







